బాలీవుడ్లో పెళ్లిళ్ల హంగామా నడుస్తుంది. మొన్న రాజ్ కుమార్ రావ్- పత్రలేఖ, నిన్న అనుష్క రంజన్- ఆదిత్య సీల్, నేడు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్. ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇక సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందనే టాక్ వినిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో ఆమె ప్రేమ లోకంలో విహరిస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా శ్రద్ధా కపూర్ వివాహాంపై అలనాటి నటి, ఆమె మేనత్త పద్మిని కొల్హాపురి తాజాగా ఓ హింట్ ఇచ్చింది. పద్మిని కొల్హాపురి గతంలో తను పాడిన పాటను మళ్లీ రీక్రియేట్ చేసింది. శ్రద్ధ ఈ పాటను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో షేర్ చేసుకుంది. దీనికి స్పందించిన పద్మిని ‘ నీ పెళ్లిలో కూడా ఈ పాటనే పాడుతాను’ అని రిప్లై ఇచ్చింది. అంటే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకొబోతుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
‘సాహో’తో తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకున్న శ్రద్ధా కపూర్… శక్తి కపూర్ ముద్దుల తనయగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తన అందం, అభినయంతో హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘ఆషికీ-2’ , ‘భాఘి’ సిరీస్, ‘ఏక్ విలన్’, ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’, ‘హైదర్’, ‘స్ట్రీట్ డ్యాన్సర్’, ‘చిచ్చోరే’ తదితర హిట్ సినిమాలతో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది.