Pragya Jaiswal | అఖండ బ్యూటీకి బాలీవుడ్లో బంపర్ ఆఫర్..

మొన్నటి వరకు ఒక్క ఆఫర్ వస్తే చాలు అని కళ్లు కాయలు కాచేలా వేచి చూసింది ప్రగ్యా జైస్వాల్. కంచె సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అలాంటి సమయంలో బాలకృష్ణ ఈమెను ఆదుకున్నాడు. బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమాలో ఈమె హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రగ్యాకు పెద్దగా అవకాశాలు రాలేదు. దానికి కారణం ఆమె పారితోషికం అని తెలుస్తోంది. ఒకే ఒక బ్లాక్ బస్టర్ రావడంతో అమ్మడు ఏకంగా 30 లక్షల నుంచి కోటికి తన రెమ్యునరేషన్ పెంచేసిందని.. అందుకే నిర్మాతలు ఆమె వైపు చూడటం లేదని ప్రచారం జరుగుతోంది.ఇలాంటి సమయంలో ఆమెకు బాలీవుడ్ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది.

కలలో కూడా ఊహించని విధంగా ఏకంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో రొమాన్స్ చేసే అవకాశం అందుకుంది ప్రగ్యా జైస్వాల్. ఈయనతో ఒక సాంగ్ చేయబోతుంది అఖండ బ్యూటీ. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది తాజాగా విడుదలైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఖండలో ఈ ముద్దుగుమ్మను చూసిన తర్వాత సల్మాన్ ఖాన్ మనసు పడి మరీ ప్రగ్యాకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మై ఛలా అని సాగే ఈ పాట తర్వాత బాలీవుడ్లో కచ్చితంగా తన దశ తిరుగుతుందని ఈ భామ భావిస్తుంది. పైగా సల్మాన్ ఖాన్ ది లక్కీ హ్యాండ్ అని అందరూ అంటారు. ఈయన చేతుల మీదుగా పరిచయమైన చాలా మంది హీరోయిన్లు మంచి పొజిషన్లో ఉన్నారు. కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా లాంటి హీరోయిన్లను బాలీవుడ్‌కు కు ఈయనే పరిచయం చేశాడు. అందుకే తన దశ కూడా మారిపోతుందని నమ్మకంగా ఉంది ప్రగ్యా జైస్వాల్. ఏదేమైనా ఇన్నాళ్లు టాలీవుడ్ అవకాశాల కోసం వేచి చూసిన ఈమెకు.. ఏకంగా బాలీవుడ్ ఆఫర్ రావడంతో ఎగిరి గంతులేస్తుంది. అయితే గతంలో అంతిమ్ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని ప్రగ్యా జైస్వాల్ దక్కించుకుంది. కానీ ఆ సినిమాలోని రొమాంటిక్ పార్ట్.. సినిమా ఫ్లోను దెబ్బతీస్తుందని ప్రగ్యా జైస్వాల్‌తో తీసిన సీన్లను కట్ చేసినట్లు అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Pragya Jaiswal | మెరిసే డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ అందాలు..
Pragya Jaiswal | అందాల యువరాణిలా ప్రగ్యా జైస్వాల్..
చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడా? క్లారిటీ ఇచ్చిన సల్లూ భాయ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

