Mahaan Movie in OTT | చియాన్ విక్రమ్ ( Vikram ) నటించిన తాజా చిత్రం మహాన్. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ ( Karthik subbaraj ) దర్శకుడు. గ్యాంగ్‌స్టర్ తండ్రి, అతని కొడుకు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక్కడ విశేషమేంటంటే.. రియల్ లైఫ్ తండ్రీకొడుకులు.. రీల్ లైఫ్ తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారు. తొలిసారిగా విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ ( Dhruv Vikram ) కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలని ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా కారణంగా ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని మహాన్ చిత్రబృందం ఫిక్సయింది.
Live life, Mahaan style 🃏
— amazon prime video IN (@PrimeVideoIN) January 24, 2022
Watch #MahaanOnPrime, Feb. 10 in Tamil, Telugu and Malayalam
Also, releasing in Kannada, #MahaPurushaOnPrime#Vikram #DhruvVikram @vanibhojanoffl @actorsimha @SimranbaggaOffc #Saranth @rdeepakparamesh @karthiksubbaraj #SSLalitKumar @7screenstudio pic.twitter.com/8wIVaFzBND
నిజానికి 2016లోనే మహాన్ సినిమా కథను విక్రమ్‌కు కార్తీక్ సుబ్బరాజ్ వినిపించాడు. కానీ అప్పటికే విక్రమ్ ఇరుమగన్ ( ఇంకొక్కడు ) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దీంతో అప్పుడు ఈ సినిమా పట్టాలెక్కలేదు. చివరకు 2020లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా చాలా రోజులుగా మహాన్ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరిగి థర్డ్ వేవ్ పరిస్థితులు ఉండటంతో.. ఈ సినిమాను ఇప్పుడప్పుడే థియేటర్లలోనే విడుదల చేయడం కుదిరేలా కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. తమ అభిమాన హీరో, ఆయన కొడుకు నటించిన సినిమాను ఓటీటీలో చూడాలని అనుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Vikram: మరో ప్రయోగానికి సిద్ధమైన విక్రమ్.. ఆసక్తిగా గమనిస్తున్న ఫ్యాన్స్
OTT | 100 రోజులు దాటినా పెళ్లి సందD ఇంకా ఓటీటీలో ఎందుకు రాలేదు..?
కలిసిపోయిన యాంకర్ రవి, శ్రీముఖి.. విభేదాలు తొలగిపోయినట్లేనా..?
Pragya Jaiswal | అఖండ బ్యూటీకి బాలీవుడ్లో బంపర్ ఆఫర్..