Vikram: మరో ప్రయోగానికి సిద్ధమైన విక్రమ్.. ఆసక్తిగా గమనిస్తున్న ఫ్యాన్స్

కొందరు హీరోలు సినిమా హిట్టా, ఫట్టా అనేది ఆలోచించకుండా తమ నటనతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయాలని భావిస్తుంటారు. కథ ఎలా ఉన్నా పాత్రపైనే ఎక్కువగా దృష్టి సారిస్తూ అభిమానుల ప్రశంసలు పొందుతూ ఉంటారు. అలాంటి వారిలో చియాన్ విక్రమ్ ఒకరు. ఆయన నటించిన ప్రతి సినిమాలోను వైవిధ్యాన్ని చూపించి అలరించారు.
కెరీర్ మొదట్లో ‘సేతు’, ‘సామి’ లాంటి హిట్స్ తన ఖాతాలో వేసుకున్న విక్రమ్… ‘అపరిచితుడు’ హిట్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాతోనే అతని ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారి ఫేమ్ వచ్చాక ప్రయోగాలకే ప్రాధాన్యత ఇచ్చాడు విక్రమ్. ప్రతి సినిమాలో రకరకాల వేరియేషన్స్ చూపిస్తాడు. అయితే ఈ ప్రయోగాలన్నీ నటుడిగా తనని మరిన్ని మెట్లు ఎక్కిస్తున్నాయి తప్ప కమర్షియల్‌గా మాత్రం నిరాశపరుస్తున్నాయి.
ప్రస్తుతం ధృవనక్షత్రం, కోబ్రా, మహాన్, పొన్నియిన్ సెల్వన్, మహావీర్ కర్ణ చిత్రాలు చిత్రాలు చేస్తున్నాడు విక్రమ్. ఇవింకా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకి కమిటయ్యాడు. రజనీకాంత్‌తో కాలా, కబాలి అనే సినిమాలు చేసిన పా రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. విక్రమ్‌కి ఇది అరవై ఒకటో సినిమా. కె.జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే టేకింగ్ స్టైల్ బాగున్నా కాన్సెప్టులు సరిగ్గా లేకపోవడమే రంజిత్ ఫెయిల్యూర్‌కి కారణమని అందరూ చెబుతారు. మరి తప్పొప్పులు సరి చేసుకొని విక్రమ్ తో హిట్ కొడతాడా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kollywood
- Pa Ranjith
- Vikram
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

