Dasara Movie | తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు రూటెడ్ కథలు ఎక్కవైపోయాయి. ఒకప్పట్లా మాకు స్టైలిష్ కథలే కావాలి.. రొటీన్‌గా ఉన్నా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే చాలు అనే హీరోలు లేరు. ఇమేజ్ పక్కనబెట్టి ఎంచక్కా దర్శకులు చెప్పింది చేస్తూ పోతున్నారు. అందుకే గత కొన్నేళ్లలో తెలుగులోనే రంగస్థలం, పుష్ప లాంటి రూటెడ్ కథలు వచ్చాయి. అలాగే ఇప్పుడు నాని లాంటి హీరో నుంచి దసరా అనే సినిమా వస్తుంది. మార్చి 30న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా పాన్ ఇండియన్ సినిమాగా వస్తుంది దసరా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ లుక్ ఏ ముహూర్తంలో విడుదలైందో తెలియదు కానీ.. అప్పట్నుంచి ఈ సినిమాకు పుష్ప ఫీవర్ పట్టుకుంది. దీనికి పుష్పతో పోలికలున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఫస్ట్ లుక్ పోస్టర్స్ కానీ.. మొన్న విడుదలైన టీజర్ కానీ చూడ్డానికి పుష్పలా ఉందంటూ చాలా మంది చెప్పడంతో ఆ వ్యాఖ్యలు చివరికి నాని వరకు వెళ్లాయి. దీనిపై ఇప్పుడు స్పందించాడు నేచురల్ స్టార్. తన సినిమాపై పుష్ప ఛాయలున్నానే కామెంట్స్ తన వరకు వచ్చాయని ఒప్పుకున్నాడు నాని. వాటిపై స్పందిస్తూ.. అందులో నిజం లేదని.. రూటెడ్ కథలు కావడంతో ఈ రెండు ఒకేలా కనిపిస్తాయి కానీ అది తప్ప మరో పోలిక లేదని చెప్పాడు నాని. ముఖ్యంగా ఇలాంటి కథలు తెలుగులో రావడం అరుదుగా జరుగుతుంటాయని.. పుష్పలో బన్నీ గెటప్ కూడా లుంగీ, మాసిపోయిన షర్ట్ వేసుకుని ఉంటాడు కాబట్టి అలా అనిపిస్తుంది కానీ నిజానికి ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు నాని. పుష్ప అనేది పూర్తిగా గంధపు చెక్కల స్మగ్లింగ్ అని.. తమ సినిమా మాత్రం ఓ ఊళ్లో జరిగే ఆత్మగౌరవ పోరాటం అంటూ క్లారిటీ ఇచ్చాడు. గెటప్ చూడ్డానికి అలా ఉండొచ్చు కానీ రెండు సినిమాలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పాడు నాని. మార్చి 30న సినిమా విడుదల కానున్న ఈ సినిమా కచ్చితంగా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ విజయం సాధిస్తుందని నమ్ముతున్నాడు నాని. మరి ఆయన నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.
RRR at Oscars | హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్‌ను కలిసిన చంద్రబోస్