Naresh | నటుడిగా, పొలిటిషియన్‌గా, సామాజిక కార్యకర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేశ్ (Naresh) . దశాబ్దాలుగా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇండస్ట్రీలో విజయవంతంగా 52 ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు నరేశ్. మరోవైపు జనవరి 20న పుట్టినరోజు జరుపుకోనున్నాడు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో నరేశ్ పద్మ పురస్కారాలపై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయమై నరేశ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు భారతరత్న, విజయ్ నిర్మలకు పద్మ పురస్కారం రావాలని డిమాండ్ చేశాడు. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయ్నిర్మల. మా అమ్మకు అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించానన్నాడు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పురస్కారం కోసం సిఫారసు చేశారు. అయినా మా అవార్డు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
తెలుగు ఇండస్ట్రీలో ఆ అర్హత కలిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. మనవాళ్లకు అవార్డులు వచ్చేందుకు నిరాహార దీక్ష చేసినా తప్పులేదన్నాడు. మా అమ్మకు పద్మ పురస్కారం కోసం ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశాడు. మరి నరేశ్ కామెంట్స్‌పై ఇండస్ట్రీ ప్రముఖులు ఎలా స్పందిస్తారనేది చూడాలి.
Hero & Actor #NareshVK @ItsActorNaresh Important Press Meet On The Occasion Of Successful Completion Of 52 Years & Celebrating Birthday On January 20th . pic.twitter.com/GxdIPBcOl0
— BA Raju’s Team (@baraju_SuperHit) January 19, 2025
Manchu Vishnu | కన్నప్ప ప్రమోషన్స్ టైం.. ఈ తరానికి కన్నప్ప ఎవరంటున్న మంచు విష్ణు
Thalapathy 70 | దళపతి 70కు ప్లాన్.. విజయ్ ఏంటీ పవన్ కల్యాణ్ రూటులోనే వెళ్తున్నాడా..?