Manchu Vishnu | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తోన్న చిత్రం కన్నప్ప (Kannappa). బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుంచి లాంచ్ చేసిన టీజర్, పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.కాగా బెంగళూరులో కన్నప్ప ప్రమోషన్స్ షురూ చేసింది విష్ణు టీం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో విష్ణు మాటలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
కన్నడ నేల నుంచి కన్నప్ప ప్రమోషన్స్ మొదలుపెట్టడం ఆనందంగా ఉందన్నాడు విష్ణు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మొదటిసారిగా కన్నప్ప సినిమా చేశారు. ఆ తర్వాత శివరాజ్‌కుమార్ చేశారు. తెలుగులో బాపు దర్శకత్వంలో స్వర్గీయ కృష్ణంరాజు కన్నప్ప చేశారు. మేం మళ్లీ ఇప్పుడు కన్నప్ప కథను చెప్పబోతున్నాం. ఈ తరానికి కన్నప్ప ఎవరు..? ఆయన కథ ఏంటీ..? ఆయన చేసిన గొప్ప కార్యాలేంటి అనేది క్లియర్‌గా చూపించాలనే కన్నప్ప సినిమా చేస్తున్నామన్నాడు.
ముఖేశ్ కుమార్ సింగ్ బుల్లితెరపై ఒక లెజెండ్ . మహాభారతం సీరియల్‌ను ఆయన అద్భుతంగా తెరకెక్కించారన్నాడు విష్ణు. కన్నప్ప కోసం భారత్ నుంచి టీంను న్యూజిలాండ్‌కు తీసుకెళ్లాం. ఇతర దేశాల నుంచి కూడా టెక్నీషియన్లను తీసుకొచ్చాం. శరత్‌కుమార్ టైంకు సెట్‌కు వచ్చేశారు. ప్రభుదేవా అన్న అడిగిన వెంటనే మా ప్రాజెక్ట్ కోసం వచ్చారు. అసలు ఈ కథ అనుకున్నప్పుడు రాక్‌లైన్ వెంకటేశ్‌కే ఫోన్ చేసి చెప్పా. అద్భుతంగా ఉంటుంది చెయ్ అంటూ నాకు ధైర్యాన్నిచ్చారు. ఆ శివుడి ఆజ్ఞతోనే ఈ సినిమా మొదలైందనిపిస్తుంది. శివుడి ఆశీస్సులతో ఈ చిత్రంతో ఏప్రిల్ 25న మీ ముందుకు రాబోతున్నామన్నాడు .
ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మంచు విష్ణు తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Court Movie | నాని ప్రోడక్షన్లో ప్రియదర్శి ‘కోర్టు’.. విడుదల తేదీ ఖరారు.!