నరేష్ అగస్త్య హీరోగా జీనీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చైతన్య గండికోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డా॥ ఎం.రాజేంద్ర నిర్మిస్తున్నారు. శ్రేయ రుక్మిణి కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీవిష్ణు క్లాప్‌నివ్వగా, రఘుబాబు కెమెరా స్విఛాన్ చేశారు.
వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: విద్యాసాగర్ చింతా, సంగీతం: మిక్కీ జే మేయర్, మాటలు: లక్ష్మీభూపాల, రచన-దర్శకత్వం: చైతన్య గండికోట.