Nara Rohith | హైదరాబాద్ : నటుడు నారా రోహిత్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఆయనకు కళ్యాణ ఘడియలు వచ్చేశాయి. ప్రతినిధి 2 హీరోయిన్ సిరిలెల్లతో నారా రోహిత్ పెళ్లి జరగనుంది. అయితే ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో నారా రోహిత్ నిశ్చితార్థ వేడుక జరిగింది.
ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, సిరిలెల్ల కుటుంబ సభ్యులతో పాటు ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. నిశ్చితార్థం అనంతరం నారా రోహిత్, సిరిలెల్లకు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇక రోహిత్, సిరిలెల్ల ఎంగేజ్మెంట్కు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు తమ్ముడి కుమారుడే నారా రోహిత్. ఈయన ‘బాణం’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. యాక్షన్ డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2011లో విడుదలైన ‘సోలో’తో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు నారా రోహిత్. ఆ తర్వాత ‘సారొచ్చారు’, ‘ఒక్కడినే’, ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’, ‘అసుర’, ‘జో అచ్యుతానంద’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు రోహిత్. 2018లో విడుదలైన ‘వీర భోగ వసంత రాయలు’ సినిమా తర్వాత దాదాపు ఆరేండ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నటి సిరితో రోహిత్‌కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Bigg Boss Telugu 8 | దసరా స్పెషల్.. సందడి సందడిగా బిగ్ బాస్ కొత్త ప్రోమో
NBK 109 | దీపావళికి బాలయ్య ‘ఎన్బీకే 109’ టైటిల్ టీజర్
Game Changer | విడుదల తేదీ ప్రకటించిన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’