NBK 109 | టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఎన్బీకే 109. వాల్తేరు వీరయ్యతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. దసరా కానుకగా మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్.
ఈ సినిమా టైటిల్ టీజర్‌ను దీపావళి కానుకగా.. విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌తో పాటు కన్నడ నటుడు రిషి విలన్ పాత్రల్లో నటించబోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. ఊర్వశి రౌటేలా పోలీసాఫీసర్‌గా కనిపించబోతుంది. చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది.
Prepare to be captivated by his power, reign, and fury! 💪🔥🔥
Our #NBK109 arriving in cinemas worldwide this Sankranti 2025. 🙌
An enthralling #NBK109TitleTeaser is coming your way this Diwali..
Stay tuned for the Roaring Treat 💥💥#HappyDusshera
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺… pic.twitter.com/0nlapsLQHC— Bobby (@dirbobby) October 12, 2024