Bigg Boss Telugu 8 | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఆరోవారం చివరిరోజుకు చేరుకుంది. ఇప్పటికే హౌజ్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అవ్వగా వైల్డ్ కార్డులతో ఎనిమిది మంది మళ్లీ హౌజ్‌లోకి వచ్చారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే ఎలిమినేషన్‌కు సంబంధించి నామినేషన్స్ అయిన వారిని చూసుకుంటే.. గంగవ్వతో పాటు, మెహబూబ్, యష్మి గౌడ, విష్ణు ప్రియా, కిరాక్ సితా ఉన్నారు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారు అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలియనుంది. ఇదిలావుంటే దసరా పండగ సందర్భంగా ఈరోజు ఎపిసోడ్‌కి సంబంధించి స్పెషల్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో హౌజ్‌మేట్స్ అంతా కలిసి బతుకమ్మ ఆడడం. దసరా పండుగను సెలబ్రేట్ చేసుకోవడంతో హౌజ్ అంతా సందడిగా మారింది. ఇక దీనితో పాటు శ్రీను వైట్ల, గోపిచంద్ వచ్చి హౌజ్‌మేట్స్‌ను సర్ప్రైజ్ చేయడం. మంగ్లీ ఎల్లమ్మ పాటతో హౌజ్ అంతా పార్టీలా మారడం ప్రోమోలో చూడవచ్చు.