Game Changer | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో గేమ్‌ఛేంజర్ (Game changer) ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan), తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. మొదట ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. అయితే డిసెంబర్లో పుష్ప సినిమా ఉండడం.. మరో వైపు క్రిస్మస్ కంటే సంక్రాంతి బెటర్ అని చిత్రబృందం భావించడంతో ఈ చిత్రం క్రిస్మస్ నుంచి సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించింది. అయితే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను గేమ్ ఛేంజర్ కోసం వాయిదా వేసుకున్నారు. దీనిపై నిర్మాత దిల్ రాజు కూడా వీడియో రూపంలో అధికారిక ప్రకటన ఇచ్చాడు.
Wishing you all Happy Dussehra! ❤️#GameChanger command begins on Jan 10th ✊🏼
Only in theatres 🔥Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @iam_SJSuryah @MusicThaman @actorsrikanth @yoursanjali @Naveenc212 @AntonyLRuben @DOP_Tirru @artkolla @HR_3555… pic.twitter.com/Vh1MoVppem
— Sri Venkateswara Creations (@SVC_official) October 12, 2024