Adarsha Kutumbam| టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) క్రేజీ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం AK47’ (Adarsha Kutumbam).‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’వంటి చిత్రాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించాడని తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఫుల్ లెంగ్త్ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్‌లో వెంకీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసిపోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. టాలీవుడ్ యాక్టర్ నారా రోహిత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నాడు. లేటెస్ట్ టాక్ ప్రకారం నారా రోహిత్ ఇందులో యాంటీ కాప్ రోల్లో కనిపించనున్నాడట. ఆదర్శ కుటుంబం షూటింగ్ జెట్ స్పీడ్‌లో కొనసాగుతుండగా.. నారా రోహిత్ ఇప్పటికే సెట్స్‌లో జాయిన్ అయ్యాడని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే తన పోర్షన్లకు సంబంధించిన చిత్రీకరణ షురూ అయిందట.
ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్రకటించగా.. పలు కారణాలతో వాయిదా పడ్డది. మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూట్ పూర్తయిన తర్వాత దృశ్యం ౩పై ఫోకస్ పెట్టనున్నాడు వెంకీ.
Anti Biotics | యాంటీ బయోటిక్స్ వాడితే.. పేగుల ఆరోగ్యాన్ని ఇలా రక్షించుకోండి..!
Mirai | టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైన బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’… ఈ నెలలోనే స్టార్ మా లో సందడి
Bhadradri Kothagudem : ‘గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు’