Hit : The 3rd Case | ఇటీవలే సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాని (Nani). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఓ వైపు సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ప్రాంఛైజీల్లో ఒకటి హిట్ త్రీక్వెల్ అప్డేట్ కూడా అందించాడని తెలిసిందే. ఇప్పటికే హిట్, హిట్-2 చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది హిట్ 3 (HIT: The 3rd Case).
ఇప్పటికే నాని పాత్రపై స్నీక్ పీక్ అందిస్తూ విడుదల చేసిన గ్లింప్స్ మంచు పర్వతాల మధ్య కారుతో దూసుకుపోతున్న హిట్ ఆఫీసర్ని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఛేజ్ చేస్తున్న సన్నివేశాలతో షురూ అయింది. కాగా ఇప్పుడు హిట్ చిత్రీకరణకు సంబంధించిన వార్త బయటకు వచ్చింది. అర్జున్ సర్కార్ డ్యూటీలో చేరిపోయాడు. మేకర్స్ ఇవాళ హైదరాబాద్‌లో హిట్ ౩ షూటింగ్ షురూ చేశారు. ఫస్ట్ షెడ్యూల్లో నాని అండ్ టీంపై వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని హోం బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని తెరకెక్కిస్తున్నారు. హిట్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని సిగార్ తాగుతూ, రక్తపు చేతులతో కారు నడుపుతూ, మరోవైపు గొడ్డలితో స్టైలిష్‌గా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు నాని. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీ 2025 మే 1న గ్రాండ్‌గా విడుదల కానుంది.
#HIT3 shoot begins in Hyderabad with Natural Star @NameisNani taking charge as 𝗔𝗥𝗝𝗨𝗡 𝗦𝗔𝗥𝗞𝗔𝗔𝗥 ❤️🔥#HIT : The Third Case in cinemas worldwide on 1st MAY, 2025.#Nani32 pic.twitter.com/thmvXDMC6n
— Suresh PRO (@SureshPRO_) September 13, 2024
Pawan Kalyan | జెట్టీ యాక్టర్ కృష్ణకు పవన్ కల్యాణ్ ప్రశంసలు.. కారణమిదే.. !
Bad Newz | తృప్తి డిమ్రి బ్యాడ్ న్యూజ్ను ఇక ఉచితంగా చూసేయొచ్చు.. ప్లాట్‌ఫాం ఇదే
Kanchana 4 | రాఘవా లారెన్స్ కాంచన 4 స్క్రిప్ట్ ఫైనల్.. పూర్తి వివరాలివే..!
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ ఎంట్రీ.. ఇంతకీ ఎన్ని భాషల్లోనంటే..?