టాలీవుడ్ స్టార్ హీరో నాని సోదరి దీప్తి ఘంట డైరెక్ట్ చేస్తున్న అంథాలజీ ప్రాజెక్ట్ మీట్ క్యూట్ (Meet Cute). రుహానీశర్మ, వర్ష బొల్లమ్మ, ఆదా శర్మ, ఆకాంక్ష సింగ్, శివ కందుకూరి, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ముందుగా ప్రకటించినట్టుగానే ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.
నీకు మీట్‌క్యూట్ అంటే తెలుసా..? అనుకోకుండా ఇద్దరు అపరిచితులు కలిసినపుడు.. ఆ క్యూట్ సిచ్యుయేషన్స్..అంటూ అంథాలజీలో సాగే పాత్రలను పరిచయం చేస్తూ నాని వాయిస్ ఓవర్‌తో మొదలైంది ట్రైలర్. వివిధ రకాల ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వ్యక్తుల పరిచయం మొదలు కొని, వారి ప్రయాణం ఎలా సాగిందనే కథాంశంతో మీట్ క్యూట్ సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పింది దర్శకురాలు దీప్తి ఘంట.
మీట్ క్యూట్ చిత్రంలో సత్యరాజ్, రోహిణి, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీట్ క్యూట్ సినిమాకు విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తుండగా.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్ నేనితో కలిసి తెరకెక్కిస్తున్నాడు నాని. నవంబర్ 25 నుంచి సోనీ లివ్ లో స్ట్ట్రీమింగ్ కానుంది మీట్ క్యూట్.
మీట్ క్యూట్ ట్రైలర్..వీడియో
https://twitter.com/SonyLIVIntl/status/1593491695630536705
Read Also : Love Today Trailer | మా ఇంట్లో నేనేం చెప్తే అది.. కానీ ఈ ఇంట్లో కొంచెం కష్టం.. లవ్ టుడే ట్రైలర్
Read Also : Ram Charan | రాంచరణ్ నయా జిమ్ చూశారా..? ఆర్సీ 15 కోసం వర్కవుట్స్ వీడియో