ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’ (Love Today). టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇదే టైటిల్‌తో తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. కాగా ఇవాళ లవ్ టుడే తెలుగు ట్రైలర్ (Love Today Trailer) ను మూవీ లవర్స్‌కు అందించారు మేకర్స్. విజయ్ దేవరకొండ ట్రైలర్ ను లాంఛ్ చేశాడు.
హీరోయిన్ తండ్రి సత్యరాజ్ దగ్గరకు వెళ్లిన హీరో ప్రదీప్ రంగనాథన్ తమ ప్రేమ విషయం చెబుతాడు. మీ ఇంట్లో ఒకేనా..అని సత్యరాజ్ అడిగితే.. మా ఇంట్లో ఒకే అంకుల్ నేనేం చెప్తే అది.. అంటున్నాడు హీరో ప్రదీప్ రంగనాథన్. కానీ ఈ ఇంట్లో కొంచెం కష్టం.. నేనేం చెప్తే అదే.. ఒకే ఒక రోజు నీ ఫోన్ తను.. తన ఫోన్ నువ్వు మార్చుకుంటారు..రేపు మీరు ఒకే అనుకుంటే నాకు డబుల్ ఒకే..అంటూ ట్విస్ట్ ఇచ్చాడు సత్యరాజ్. ఈ క్రమంలో హీరోహీరోయిన్ల మధ్య ట్రాక్ ఎలా నడిచిందని కొంచెం సస్పెన్స్ లో పెడుతూ సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
లవ్ టుడే చిత్రంలో ఇవానా హీరోయిన్గా నటించింది. సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్టైనమెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్.
లవ్ టుడే తెలుగు ట్రైలర్..
Read Also : Dhamki | ఫస్ట్ లుక్‌తోనే ధమ్కీ ఇస్తున్న విశ్వక్ సేన్.. ట్రెండింగ్‌లో పోస్టర్
Read Also : Ram Charan | రాంచరణ్ నయా జిమ్ చూశారా..? ఆర్సీ 15 కోసం వర్కవుట్స్ వీడియో