Filmfare Awards South 2024 | 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2024 (69th sobha filmfare awards south 2024) వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల నుంచి పలువురు సినీ ప్రముఖలు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అయితే తెలుగులో బలగంతో పాటు నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు సత్తా చాటాయి. ఈ వేడుకలో ‘దసరా’ (Dasara) చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాని (Nani) అవార్డు అందుకున్నారు. అయితే ఈ అవార్డు అందుకున్న అనంతరం నాని అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కెరీర్ ఆరంభంలో తాను ఎన్నో అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నానని.. అప్పుడు తనకు కూడా అవార్డు అందుకోవాలని బలంగా అనిపించేది. కానీ ఇప్పుడు ఆ కోరిక మెల్లి మెల్లిగా తగ్గుతూ వస్తుంది. అవార్డుల విషయంలో ఇప్పుడు ఆ కోరిక లేదు. కానీ ఇప్పుడున్న నా కోరిక ఏంటి అంటే నా దర్శకులు, నా టెక్నిషియన్లు, నా నిర్మాతలు, నా సినిమాలో నటించే నటులు, ఇలా నా సినిమాలో పనిచేసే వాళ్లందరూ అవార్డులు తీసుకుంటుంటే నేను అక్కడ కుర్చోని చూడాలని ఉంది. ఆ కోరిక తీరాలని గట్టిగా ఉంది. నేను నిజంగా ఈ అవార్డు తీసుకోవడానికి ఇక్కడికి రాలేదు.
దసరా సినిమాకు శ్రీకాంత్, హాయ్ నాన్న సినిమాకు శౌర్యువ్ దర్శకులుగా అవార్డులు అందుకుంటుంటే చూద్దామని ఇక్కడకు వచ్చాను. కానీ వాళ్ళిద్దరికి నేను అవార్డును ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. కొత్త టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ప్రయాణంలో నేనూ భాగమైతే అది నాకెంతో ఆనందాన్నిస్తుంది. మీ తొలి అడుగులో నేనొక ఇటుకగా మారితే అదే నాకు పెద్ద అవార్డు. అది చాలు నాకు. 2023 నాకెంతో ప్రత్యేకమైనది. థ్యాంక్యూ సో మచ్ అంటూ నాని చెప్పుకోచ్చారు.
Also Read..
Korba-Visakha Express | కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మూడు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం
Filmfare Awards South 2024 – Malayalam | ఉత్తమ నటుడిగా మెగాస్టార్.. ఉత్తమ చిత్రంగా 2018