Korba-Visakha Express | కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మూడు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పెనుప్రమాదం తప్పింది. విశాఖ స్టేషన్లో నిలిపి ఉంచిన కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ (Korba-Visakha Express) రైల్లో మూడు ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్క బోగీలకు కూడా వ్యాపించడంతో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పెనుప్రమాదం తప్పింది. విశాఖ స్టేషన్లో నిలిపి ఉంచిన కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ (Korba-Visakha Express) రైల్లో మూడు ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్క బోగీలకు కూడా వ్యాపించడంతో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. రైల్వే స్టేషన్ మొత్తం దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. రైల్వే సిబ్బంది మంటలను అదుపుచేసేలోపే బీ-6, బీ-7, ఎం-1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే రైలులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
రైలు ఉదయం 7 గంటలకు కోర్బా నుంచి విశాఖకు వచ్చిందని అధికారులు తెలిపారు. మెయింటేనెన్స్ అనంతరం దానిని తిరుమల ఎక్స్‌ప్రెస్‌గా వినియోగిస్తారని చెప్పాయి. ఈ క్రమంలో ఉదయం 10.10 గంటల సమయంలో రైలులోని జీ-7 బోగీలో మంటలు చెలరేగాయని, సిబ్బంది వాటిని ఆర్పేలోగా ఇదర బోగీలకు వ్యాపించాయని వెల్లడించారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్య్కూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

