Filmfare Awards South 2024 – Malayalam | 69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 (Filmfare Awards 2024) మలయాళంలో 2018 చిత్రం సత్తా చాటింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు అవార్డులను ఎగరేసుకుపోయింది. ఇక మలయాళం యువ నటి విన్సీ అలోషియస్ రేఖ(Rekha) సినిమాకు గాను ఏకంగా ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. మరోవైపు మలయాళం నుంచి ఉత్తమ నటుడిగా నన్పకల్ నేరతు మయక్కం(Nanpakaal Nerathu mayakkam) చిత్రానికి మెగాస్టార్ మమ్ముట్టి అవార్డు అందుకున్నాడు. తమిళ నటి జ్యోతిక కాథల్ ది కోర్ చిత్రానికి ఉత్తమ నటి(క్రిటిక్స్)గా అవార్డు గెలుచుకుంది. మలయళం నుంచి ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న విజేతలు చూసుకుంటే..
ఉత్తమ నటుడు : మమ్ముట్టి (నన్పాకల్ నేరతు మయక్కం)
ఉత్తమ నటి : విన్సీ అలోషియస్ (రేఖ)
ఉత్తమ చిత్రం : 2018
ఉత్తమ దర్శకుడు : జూడ్ ఆంథనీ జోసెఫ్ (2018)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : జోజు జార్జ్ (ఇరట్ట)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : జ్యోతిక (కథల్- ది కోర్)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) : కథల్- ది కోర్ (జియో బేబీ)
ఉత్తమ సహాయ నటి : పూర్ణిమ ఇంద్రజిత్ (తురముఖం), అనశ్వర రాజన్ (నెరు)
ఉత్తమ సహాయ నటుడు : జగదీష్ (పురుష ప్రేతమ్)
ఉత్తమ సంగీత ఆల్బమ్ : ఆర్డీఎక్స్ (సామ్ సీఎస్)
ఉత్తమ సాహిత్యం : అన్వర్ అలీ (ఎన్నమ్ ఎన్ కావల్- కథల్- ది కోర్)
ఉత్తమ నేపథ్య గాయకుడు (మేల్) : కపిల్ కపిలన్ (నీలా నిలవే- RDX)
ఉత్తమ నేపథ్య గాయని (ఫిమేల్) : కె ఎస్ చిత్ర (ముత్తతే ముల్లా- జవాను ముల్లపూవుమ్)
Also Read..
Bomb threat | బీహార్ సీఎం ఆఫీస్కు బాంబు బెదిరింపు.. కేసు నమోదు..!
Friendship Day | పేదాగొప్ప అంతరాలు పట్టని స్నేహం.. బీదాబిక్కీ అని మాత్రం ఆలోచిస్తుందా..?