Akkineni Nagarjuna | టాలీవుడ్ నటి సమంత, అక్కినేని నాగార్జున (Nagarjuna)పై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ వివాదాస్పదన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసుతోపాటు, పరువు నష్టం దావా వేశాడు. పిటిషన్ విచారణలో భాగంగా నాగార్జున, అమల, నాగచైతన్య, సుప్రియ, వెంకటేశ్వర్లు ఇప్పటికే నాంపల్లి కోర్టు ఎదుట కూడా హాజరయ్యారు.
తాజాగా నాగార్జున వేసిన దావాపై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. కొండా సురేఖ తరపున అడ్వకేట్ కౌంటర్ ఫైల్ చేశారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. ఇప్పటికే నాంపల్లి కోర్టు నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. మా కుటుంబానికి మంచి పేరు, ప్రతిష్టలున్నాయి. కొండా సురేఖ నా కుటుంబంపై అమర్యాదకరంగా.. నాగచైతన్య, సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి కామెంట్స్ చేశారని ఆరోపించారు.
War 2 | హృతిక్ రోషన్ వర్సెస్ తారక్ .. వార్ 2లో అదిరిపోయే కత్తిసాము సీక్వెన్స్