Potholes | రాయపోల్, సెప్టెంబర్ 18 : రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారిన రాయపోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గుంతలను గ్రామపంచాయతీ కార్యదర్శి శివకుమార్, ఎస్ఐ మానస ఆధ్వర్యంలో ఆర్అండ్బీ రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి వేయించారు. ఈ గుంతలతో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో అటు వాహనదారులు, ఇటు స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సంవత్సరం కాలం నుంచి నడి రోడ్డుపై గుంత ఏర్పడి.. వర్షాలు కురిసినప్పుడు నీరు చేరడంతో రోజు పోయి వచ్చే వాహనాలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేది. గజ్వేల్ నుంచి దౌల్తాబాద్ ఆర్అండ్బీ రోడ్డు పరిధిలోని రాయపోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద గుంత ఏర్పడి వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సంబంధిత ఆర్అండ్బీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ విషయమై నమస్తే తెలంగాణ వెబ్ (www.ntnews.com) వచ్చిన కథనానికి రాయపోల్ ఎస్ఐ మానస స్పందించారు. ఎస్ఐ మానస పంచాయతీ కార్యదర్శి శివకుమార్ ఆధ్వర్యంలో ఎట్టకేలకు రాత్రి గుంతను పూడ్చి వేయించారు. దీంతో వాహనాదారులకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా మారింది. ఎస్ఐ మానస, పంచాయతీ కార్యదర్శి శివకుమార్ గుంతను పూడ్చి వేయడం పట్ల ప్రయాణికులు, వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Drugs | మాసాయిపేటలో 4 కిలోల డ్రగ్స్ పట్టివేత..
Promotions | రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
Traffic Jam | హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్