ఇటీవల కాలంలో నిర్మాత నాగవంశీ(Naga Vamsi) పేరు తెలుగు సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రతి విషయంలోనూ కుండబద్దలు కొట్టినట్లు.. ముక్కుసూటిగా మాట్లాడుతుంటాడు ఈ యువ నిర్మాత. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై భారీ చిత్రాలతో పాటు, కంటెంట్ వున్న చిన్న సినిమాలను కూడా నిర్మిస్తుంటారు నాగవంశీ. ప్రస్తుతం ఆయన సంస్థలో నిర్మించిన చిత్రం లక్కీ భాస్కర్(Lucky Baskhar). దుల్కర్సల్మాన్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.
బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థల్లోని లోటు పాట్లను చర్చిస్తూ వెంకీ అట్లూరి (Venky Atluri)దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నాగవంశీ మహేష్‌బాబు- త్రివిక్రమ్‌లతో ఆయన నిర్మించిన గుంటూరు కారం(Guntur Karam) చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్‌తో యావరేజీ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం గురించి గుంటూరు కారం విషయంలో మీరు హ్యపీగా వున్నారా అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు.
దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు ” గుంటూరు కారం కమర్షియల్‌గా మాకు సేఫ్ ప్రాజెక్ట్. కేవలం నైజాం ఏరియాలోనే కొంత లాస్ అయ్యాం. ఇందులో అబద్దం ఏమీ లేదు. కావాలంటే మీరు కలెక్షన్లు తెలుసుకోండి. అది కూడా సంక్రాంతి పండుగకు హైదరాబాద్ వాళ్లు సొంత ఊర్లకు ఆంధ్రాకు వెళ్లిపోవడం వల్ల ఇక్కడ పెద్దగా ఆడలేదు. ఇక గుంటూరు కారం కంటెంట్ విషయంలో అందరం హ్యపీయే. ఆ విషయంలో ఏ తప్పు జరగలేదు. ఈ సినిమాకు వచ్చిన రివ్యూలు కూడా కరెక్ట్ కాదు. మేము అనుకున్న సినిమా వేరు. రివ్యూయర్స్ చూసిన యాంగిల్ వేరు.
అందుకే సినిమా విషయంలో వాళ్లు మిశ్రమంగా స్పందించారు. అయితే గుంటూరు కారం అనే టైటిల్ కొంచెం మైనస్ అయిందని అనుకుంటున్నాను. కుటుంబంతో కలిసి చూడదగ్గ ఫ్యామిలీ చిత్రానికి గుంటూరు కారం అనే మాస్ టైటిల్ కరెక్ట్ కాదేమో అనిపించింది. అంతేకాదు ఇలాంటి ఫ్యామిలీ సినిమాకు మిడ్నైట్ ఒంటి గంట షో కూడా వేయకూడదు. ఈ సినిమా విషయంలో ఇలాంటి తెలియని పొరపాట్లు మాత్రమే జరిగాయి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగవంశీ గుంటూరు కారం మీద చేసిన ఈ కామెంట్స్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read :
Samantha | కొండా సురేఖ కామెంట్స్‌పై మరోసారి స్పందించిన సమంత
Radhika Apte | బేబిబంప్‌తో రాధికా ఆప్టే .. అభిమానులకు గుడ్‌న్యూస్
Unstoppable With NBK | బాలకృష్ణతో సూర్య, దుల్కర్ సల్మాన్ సందడి.. క్రేజీ వార్త వివరాలివే