Shah rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలో సందడి చేశారు. ముంబైలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు షారుఖ్, తన భార్య గౌరీ ఖాన్ మరియు కుమార్తె సుహానా ఖాన్‌లతో కలిసి హాజరయ్యాడు.
షారుఖ్ ఖాన్ సంప్రదాయబద్ధమైన తెలుపు-క్రీమ్ కలర్ దుస్తుల్లో, సన్‌గ్లాసెస్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించాగ.. ఆయన భార్య గౌరీ ఖాన్ మస్టర్డ్ కలర్ ఎంబ్రాయిడరీ చీరలో మెరిసిపోయింది. ఇక కుమార్తె సుహానా ఖాన్ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ లెహంగా, నెక్లెస్‌తో పెళ్లి వేడుకకు నిండుదనాన్ని తీసుకువచ్చింది. ఈ స్టార్ ఫ్యామిలీ వేదిక వద్దకు చేరుకోగానే కెమెరా కళ్లు వారిపైనే నిలిచాయి. షారుఖ్ తనదైన శైలిలో అతిథులను పలకరిస్తూ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సచిన్ టెండూల్కర్ కుటుంబంతో షారుఖ్‌కు ఉన్న దశాబ్దాల అనుబంధం నేపథ్యంలో, ఈ వివాహానికి ఆయన హాజరుకావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ వేడుకకు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ దంపతులు అభిషేక్ బచ్చన్ దంపతులు, క్రికెటర్ ధోని దంపతులు హాజరయ్యారు.
As jethalal once said – KKR use Sachin Tendulkar dono k beech underground Rishta hai
(kyuki dono k bacche ek hi school me jate thee😂😂 )So Shahrukh Khan with his family attended Arjun Tendulkar’s wedding ceremony 😂pic.twitter.com/HI6MJVcAuy
— 𝑨𝑻10 (@Loyalsachfan10) March 5, 2026