VD12 | లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయింది. ఇక ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలన్న కసితో ఉన్న విజయ్ దేవరకొండ వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి వీడీ12 (VD12). జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు.
మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిర్మాత సూర్య దేవర నాగవంశీ అదిరిపోయే అప్డేట్ అందించాడు. మీ అందరి నిందల తర్వాత నేను గౌతమ్‌ను చాలా హింస పెట్టాక.. ఫైనల్‌గా టైటిల్‌ను లాక్ చేశాం. వీడీ 12 టైటిల్ త్వరలోనే వెల్లడిస్తామని నాగవంశీ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఆ టైటిల్ ఏమై ఉంటుందా అని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
ఈ సినిమాను మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారని వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీ టీజర్‌ను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తొలిసారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడు. విజయ్ దేవరకొండ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
VD12 టైటిల్ పై నిర్మాత నాగవంశీ..
Mee andari abuses tarvathaa nenu Gowtam ni chala himsa pettaka 😝😝
Finally we’ve locked the title!! 🤓#VD12 title will be out very soon!!Watchout this space 🤩🤩
— Naga Vamsi (@vamsi84) January 31, 2025
VD12 టీజర్ రెడీ…
Exclusive : #VD12 టీజర్ రెడీ అయ్యింది…
ఫిబ్రవరి 7న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
టీజర్ లో రిలీజ్ డేట్ చెప్పబోతున్నారు.
May 30th 💥
— Rajesh Manne (@rajeshmanne1) January 21, 2025
Ram Gopal Varma | సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా.. కానీ ఆ వార్తలు అబద్ధం.. పుకార్లపై రాంగోపాల్ వర్మ