Naga Chaitanya | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ (Thandel) సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే NC24ను ప్రకటించేసి అక్కినేని అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు.
విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మైథలాజికల్ టచ్‌తో ఈ సినిమా ఉండబోతుందట. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ రెండో వారం నుంచి షురూ కానుందని తెలుస్తుండగా.. తాజాగా ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై ఆసక్తికర వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ది గోట్, లక్కీ భాస్కర్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న మీనాక్షి చౌదరిని హీరోయిన్గా తీసుకోబోతున్నారట. ప్రస్తుతానికి ఇది అధికారిక వార్త కాకున్నా.. అప్పుడే ఈ న్యూస్‌ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చైతూ ఫాలోవర్లు. మరి మేకర్స్ దీనిపై రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Meenakshi Chaudhary
ఎన్సీ24 వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బోగవల్లి ప్రసాద్-సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
NAGA CHAITANYA STARS IN PAN-INDIA FILM… BVSN PRASAD – SUKUMAR COLLABORATE… On #NagaChaitanya‘s birthday today, producers #BVSNPrasad and #Sukumar and director #KarthikDandu [of #Virupaksha fame] announce a PAN-India film with a special poster.
The film [#NC24] – not titled… pic.twitter.com/tMvepaNL55
— taran adarsh (@taran_adarsh) November 23, 2024
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్
Kissik | అల్లు అర్జున్, శ్రీలీల స్టైలిష్ డ్యాన్స్.. కిస్సిక్ ఫుల్ సాంగ్ లాంచ్ టైం ఫిక్స్
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన