Kalki 2898 AD | తెలుగు సినిమా ఖ్యాతిని గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద చాటి చెప్పిన చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో వచ్చిన ఈ చిత్రం రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ డే నుంచి ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఇప్పటికే సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న నాగ్ అశ్విన్ టీం మరోసారి ఆ మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఇంతకీ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా..? కల్కి 2898 ఏడీ 50వ రోజు స్పెషల్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎంలో స్క్రీనింగ్ చేయగా.. ఈ షోకు నాగ్ అశ్విన్ హాజరయ్యాడు. సినిమా రన్ అవుతుండగా ప్రభాస్ అభిమానులతో కలిసి కాగితాలు విసిరేసి ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.
Nagi is a Pure Fan boy of Prabhas
Anna🤩💥💥 #Kalki2898AD #Prabhas #NagAshwin pic.twitter.com/kQuq4YEVsZ— Prabhas Devotee🔥 (@Sainath59279861) August 16, 2024
The Goat Trailer | విజయ్ ది గోట్ ట్రైలర్ ఆన్ ది వే.. సస్పెన్స్‌కు వెంకట్ ప్రభు చెక్
Devara Part 1 | పాపులర్ కంపెనీకి తారక్ దేవర ఓవర్సీస్ రైట్స్.. గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్
Amaran | జవాన్ల సేవలను స్మరించుకుంటూ.. శివకార్తికేయన్ అమరన్ మేకింగ్ వీడియో