Prabhas Fauji | రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. కల్కి సినిమాతో ఫుల్ జోష్ మీదున్న అభిమానులకు మరో క్రేజీ అప్డేట్ రానుంది. ప్రభాస్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ నుంచి ఈ దసరాకు స్పెషల్ అప్డేట్ రానుంది. ప్రభాస్ కథానాయకుడిగా పడి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి చిత్రాల ఫేమ్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా తమిళనాడులోని మధురైలో జరుపుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనడంలేదు. రెండో షెడ్యూల్ నుంచి పాల్గొంటారని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదిలావుంటే ఈ మూవీ నుంచి దసరా కానుకగా గ్లింప్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఇమాన్ ఎస్మాయిల్ నటిస్తుంది.
ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారట. అందుకే ఈ మూవీ టైటిల్ ‘ఫౌజీ’ అయితే బావుంటుందని బృందం భావిస్తున్నది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రానుండగా బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారట. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు.
Also Read..