టాలీవుడ్ (Tollywood) హీరో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితమే ఈ మూవీని ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్ టీం. బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న అఖండ చిత్రాన్నిపూర్తి చేసిన తర్వాత బాలకృష్ణ (Nandamuri Balakrishna) గోపీచంద్ మలినేని సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.
కాగా ఈ సినిమాకు రౌడీయిజం (Rowdyism) అనే ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఇప్పటికే వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా స్పష్టత ఇచ్చారు. సినిమా టైటిల్ రౌడీయిజం కాదని, స్టార్ హీరో సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని టీం తెలిపింది. సరైన సమయంలో NBK 107 అప్ డేట్ ఉంటుందని, పుకార్లని నమ్మవద్దని ట్వీట్ ద్వారా పేర్కొంది. సాధారణంగా బాలకృష్ణ సినిమా టైటిల్స్ విషయంలో రెండు, మూడు పరిశీలించాక కానీ నిర్ణయం తీసుకోరు.
కాప్ డ్రామాగా NBK 107వ ప్రాజెక్టుగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలకృష్ణ గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్లో కనిపించబోతున్నాడట. త్వరలోనే హీరోయిన్ ఎవరనేది ప్రకటించబోతున్నారు టీం. బాలకృష్ణను గోపీచంద్ మలినేని మూడు భిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించేలా డిజైన్ చేసినట్టు టాక్.
Official announcement about #NBK107 would come as and when the time is appropriate. Do not believe in any speculations! @megopichand pic.twitter.com/p8azegPsh1
— Mythri Movie Makers (@MythriOfficial) September 15, 2021
Vijay Deverakonda | బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ..లైగర్ స్టిల్ వైరల్
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!