నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీకి రంగం సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఈ నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం గత కొంత కాలంగా బాలకృష్ణ సరైన దర్శకుని కోసం అన్వేషించి ఆ అవకాశాన్ని ప్రశాంత్ వర్మకు ఇచ్చారు. హనుమాన్ సినిమాతో తన టాలెంట్ ను పాన్ ఇండియా లెవెల్ లో నిరూపించుకున్నాడు ప్రశాంత్ వర్మ . గతంలో తీసిన జాంబీ రెడ్డి చిత్రం కూడా భారీ విజయాన్ని సాధించింది.
మొత్తానికి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కోసం సరైన దర్శకున్నే ఎంచుకున్నాడని అభిమానుల అభిప్రాయం. ఈ దర్శకుడు మోక్షజ్ఞ కోసం ఒక మైథలాజికల్ కథను సిద్ధం చేసినట్లు సమచారం. ప్రశాంత్ వర్మ నందమూరి మోక్షజ్ఞ తో చేయబోయే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను సిద్దం చేశారని టాక్ . మహాభారతంలోని ఒక ధైర్యవంతుడు అయిన ఒక వీరుని కథ ఆధారంగా చేసుకుని ఈ మైథలాజికల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. కాగా ఈ కథ గురించి హైలెట్స్ వింటుంటే… ఈ చిత్రం చరిత్ర సృష్టిస్తుంది అని ఫిల్మ్ ఇండస్ట్రీలో అంచనాలు మొదలైయ్యాయి.
మొత్తం మీద ఓ సంచలనానికి రంగం సిద్ధం చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. నందమూరి మోక్షజ్ఞ తో చేయబోయే ఈ ప్రాజెక్ట్ ను బాలకృష్ణ రెండో కూతురు తేజశ్విని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ దర్శకుడు ఇటీవల దాదాపు 30 కోట్ల వ్యయంతో స్వంత ప్రొడక్షన్ ఆఫీస్ని కూడా నిర్మించుకుంటున్నాడని సమాచారం. ఈ ఆఫీసులో వంద మంది వరకు వివిధ శాఖలకు చెందిన వారు ఈ ఆఫీసులో పని చేస్తారట. తన సినిమాకు సంబంధించిన ప్రతి పని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఈ ఆఫీసులోనే జరిగేటట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని తెలిసింది.
Also Read :
Raayan Movie | ‘రాయన్’ మేకింగ్ వీడియో రిలీజ్.. ధనుష్ డైరెక్షన్ ఎలా చేశాడో చూడండి.!
Avengers: Doomsday | ‘మార్వెల్’ నుంచి మరో క్రేజీ మూవీ.. ‘డాక్టర్ డుమ్’గా ఐరన్ మ్యాన్ నటుడు