Raayan Movie | ‘రాయన్’ మేకింగ్ వీడియో రిలీజ్.. ధనుష్ డైరెక్షన్ ఎలా చేశాడో చూడండి.!
Raayan Movie | తమిళ నటుడు ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం రాయన్ (Raayan). సందీప్ కిషన్, మలయాళం నటుడు కాళిదాస్ జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
Raayan Movie | తమిళ నటుడు ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం రాయన్ (Raayan). సందీప్ కిషన్, మలయాళం నటుడు కాళిదాస్ జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ముఖ్యంగా సినిమా చూసిన వారంతా ధనుష్ దర్శకత్వం బాగుందని కితాబు ఇస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా నేడు ధనుష్ పుట్టిన రోజు కావడంతో తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ రాయన్ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది.
ఇక ఈ వీడియోలో ధనుష్ డైరెక్షన్ హైలైట్‌గా నిలిచింది. సందీప్ కిషన్ అపర్ణ బాలమురళిని ఎలా ఎత్తుకోవాలి అని, ఎలా నటించాలి అని, దగ్గరుండి చేసి మరీ చూపిస్తున్నాడు. డ్యాన్స్ కూడా స్టెప్పులు వేసి చూపిస్తున్నాడు. ప్రతి సీన్ ని ఎలా చేయాలో ముందే చూపించడం ఈ వీడియోకి హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ వీడియోను మీరు చూసేయండి.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. అతనో సాధారణ వ్యక్తి. మద్రాస్‌లోని ఓ హోటల్లో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. కానీ అతని గతం మాత్రం పగతో రగిలిపోతుంటుంది. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతకి ఆ వ్యక్తి ప్రతీకారం ఎవరి మీద? పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ అయిన అతను హోటల్లో చెఫ్‌గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘రాయన్’ సినిమా చూడాల్సిందే అని చెబుతోంది చిత్ర బృందం. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, విష్ణువిశాల్, దుషారా విజయన్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషించారు.
Also Read..
- Avengers: Doomsday | ‘మార్వెల్’ నుంచి మరో క్రేజీ మూవీ.. ‘డాక్టర్ డుమ్’గా ఐరన్ మ్యాన్ నటుడు
- Kubera | బర్త్ డే స్పెషల్.. ధనుష్ కుబేర నయా లుక్ వైరల్
- Tirumala | తిరుమలలో కలకలం.. నడకమార్గంలో వెళ్తున్న భక్తుడిని కాటేసిన పాము
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

