Avengers: Doomsday | హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం అనుభవించిన దగ్గరి నుంచి హాలీవుడ్ టాప్ యాక్టర్‌గా ఎదగడమే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ (ఒక్క సినిమాకు రూ.300 నుంచి రూ.400 కోట్లు) తీసుకునే నటుడు అయ్యాడు. ఇక రాబర్ట్ డౌనీది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ది విడదీయలేని బంధం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఐరన్ మ్యాన్ చిత్రాలతో పాటు అవెంజర్స్ చిత్రాలలో టోని స్టార్క్ అనే కీలక పాత్రలో నటించాడు. అయితే ఈ పాత్రకు ముగింపు పలికిన విషయం తెలిసిందే. అవెంజర్స్ చివరి చిత్రం అయిన అవెంజర్స్ ది ఎండ్ గేమ్ సినిమాతో ఈ పాత్రను ముగించారు. అయితే రాబర్ట్ డౌనీ జూనియర్ మళ్లీ మార్వెల్ యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
మార్వెల్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రాలు అవెంజర్స్ డూమ్స్‌డే (Avengers: Doomsday), అవెంజర్స్ సీక్రెట్ వార్స్(Avengers: Secret Wars). ఇందులో మొదటి భాగం అవెంజర్స్ డూమ్స్‌డే 2026లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ 2027 లో రానుంది. అయితే ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించేది. డాక్టర్ డూమ్(dr doom) అనే ఫిక్షనల్ విలన్ పాత్ర. ఈ పాత్రలో నటించబోయేది స్టార్ హలీవుడ్ నటుడు అంటూ ఇప్పటికే పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజా ఈ వార్తలకు చెక్ పెడుతూ డాక్టర్ డూమ్ పాత్రలో నటించేది రాబర్ట్ డౌనీ జూనియర్ అంటూ ప్రకటించారు.
డాక్టర్ డూమ్ అనే పాత్ర మార్వెల్ కామిక్స్‌లో ఉండే సూపర్‌విలన్ రోల్. ఈ పాత్ర ఇప్పటికే స్పైడర్ మ్యాన్‌తో పాటు, ఫెంటాస్టిక్ ఫోర్ చిత్రాలలో విలన్‌గా కనిపించి అలరించింది. తాజాగా ఈ పాత్రను ఇప్పుడు రాబర్ట్ చేయనున్నాడు. రుసో బ్రదర్స్ ఈ సినిమాలకు దర్శకత్వం వహించనున్నారు.
“New mask, same task.”
Robert Downey Jr. surprises Hall H to announce his return to the MCU as Doctor Doom. pic.twitter.com/j1SEjzse3p
— Marvel Studios (@MarvelStudios) July 28, 2024
Also Read..