ఏపీ ప్రభుత్వం (AP Government ) సినిమా టికెట్ల రేట్ల (movie ticket prices)ను తగ్గించిన తర్వాత వారం వ్యవధిలో సుమారు 170కిపైగా థియేటర్లు మూతపడ్డ ( movie Theatres)సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వంపై నాని కామెంట్స్ హీటెక్కిస్తున్న నేపథ్యంలో ఏపీలో అధికార యంత్రాంగం థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు డైలామాలో పడ్డారు. దీంతో థియేటర్లను నడిపించేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపడం లేదు.
శ్యామ్ సింగ రాయ్, పుష్ప, అఖండ బిజినెస్‌పై ఆశలు పెట్టుకున్న ఎగ్జిబిటర్లకు అడియాసలే మిగిలిపోయాయి. ఏపీలో థియేటర్లు మూతపడటంతో తన హృదయం బద్టలైందని కామెంట్ చేశాడు టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth). తెలుగు సినీ పరిశ్రమకు మద్దతుగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశాడు. కొన్ని నిర్ణయాల వల్ల ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు.
Theatres are like a temple to me.. Giving joy and happiness to People always. It is heartbreaking to see theatres close down..
— Nikhil Siddhartha (@actor_Nikhil) December 26, 2021
Glad and thankful to see the Telangana Govt Support the film industry..Hoping the Ap Govt helps theatres come back to their glory in a similar way 🙏🏼
ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఎగ్జిబిటర్లు అప్సెట్ అయి థియేటర్లు మూసుకున్నారని, కొందరు మాత్రం డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న ఒత్తిడితో థియేటర్లు నిర్వహిస్తున్నారని అన్నాడు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రీమియమ్ లేదా బాల్కనీ టికెట్లను అనువైన ధరలకు పెట్టుకునేందుకు అనుమతివ్వాలని కోరాడు. మేము పన్నులు చెల్లిస్తున్నాం. మా డబ్బులతో మీలో కొందరు లగ్జరీని అనుభవిస్తున్నారు. మీ విలాసాలు వదులుకొని మాకు డిస్కౌంట్ ఇవ్వండి అంటూ ఇప్పటికే బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ ఏపీ మంత్రులపై సెటైరికల్ ట్వీట్ పెట్టిన విషయం తెలిసిందే.