Nikhil Siddhartha | ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా యంగ్ హీరో..

Nikhil Siddhartha | ఇప్పుడు టాలీవుడ్ హీరోలు జోరు మీద ఉన్నారు. ఒక్కొక్కరు మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా చేయడానికి చాలా తిప్పలు పడ్డ మన హీరోలు.. ఇప్పుడు ఏకంగా ఒకేసారి మూడు నాలుగు సినిమాలు లైన్లో పెడుతున్నారు. చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు అయితే ఏకంగా ఐదు సినిమాలు ఒకేసారి చేస్తున్నారు వీటికి డేట్స్ ఎప్పుడు ఎలా అడ్జస్ట్ చేస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా మరో హీరో కూడా ఇదే దారిలో వెళుతున్నాడు. అతనెవరో కాదు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.
Working on 4 Movies Simultaneously…
— Nikhil Siddhartha (@actor_Nikhil) October 25, 2021
Never did this before.
Always worked only 1 at a time till now.. but this is like 4 kids who r all my favourites but don't know whom to give max priority to.
Giving my best and praying tht all 4 of them get the best release and Success 🙏🏼🥰 pic.twitter.com/7FdZGsOEbb
ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిపై సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటన చేశాడు నిఖిల్. అందులో సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 18 పేజెస్ షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సుకుమార్ అందిస్తున్నాడు. కుమారి 21 ఎఫ్ తర్వాత సుకుమార్ అంత శ్రద్ధ పెట్టి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు దర్శకుడు కూడా కుమారి 21 సినిమా తెరకెక్కించిన సూర్యప్రతాప్ పల్నాటి కావడం విశేషం. మరోవైపు చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా చేస్తున్నాడు నిఖిల్. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ రెండు సినిమాల్లో కూడా నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. వీటితో పాటు మరో రెండు సినిమాలు కూడా ఒప్పుకున్నాడు నిఖిల్. త్వరలోనే ఈ సినిమాల షూటింగ్ మొదలు కానుంది. ఓకేసారి 4 సినిమాలు చేస్తుండటం చాలా కొత్తగా అనిపిస్తుంది అంటున్నాడు నిఖిల్. తనకున్న నలుగురు పిల్లల్లో ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు.. ప్రస్తుతం తన పరిస్థితి కూడా అలాగే ఉంది అంటున్నాడు. మరి ఈ నాలుగు సినిమాలతో నిఖిల్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Nikhil: అమెరికా అధ్యక్షుడిని ‘చెప్పు తెగుద్ది వెధవ’ అని తిట్టిన నిఖిల్
చీరకట్టులో నడుము అందాలు చూపిస్తున్న అనుపమ పరమేశ్వరన్..
నిఖిల్ కార్తికేయ 2 సినిమాపై ఇంత క్రేజ్ ఉందా.. భారీ రేటుకు అమ్ముడైన రైట్స్..
Anupama Parameswaran| అనుపమ పరమేశ్వరన్ ను హ్యాపీగా ఉంచేది ఏంటంటే..!
Anupama Parameswaran అనుపమతో చనువుగా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

