నిఖిల్ కార్తికేయ 2 సినిమాపై ఇంత క్రేజ్ ఉందా.. భారీ రేటుకు అమ్ముడైన రైట్స్..

కొన్ని సినిమాలపై ఏదో తెలియని ఆసక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా సీక్వెల్స్ అయితే ఆ క్రేజే వేరు. అలాంటి ఇంట్రెస్టింగ్ సీక్వెల్ కార్తికేయ 2. విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నిఖిల్ నుంచి 2014లో వచ్చిన థ్రిల్లర్ కార్తికేయ. ఈ సినిమాతో ఎనిమల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమా రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏ స్క్రిప్ట్ తీసుకున్నా సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు దర్శకుడు చందు మొండేటి. మరొక్కసారి మనకి తెలియని కొత్త కథతో కార్తికేయ 2 చిత్రాన్ని ఈయన తీసుకొస్తున్నాడు. కమర్షియల్ విలువలు, విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా కార్తికేయ 2 సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రెండు నిర్మాణ సంస్థలు విడివిడిగా ఎన్నో సూపర్ హిట్స్ అందించాయి. అలాగే కలిసి కూడా మంచి విజయాలు అందించాయి. తాజాగా మరోసారి నిఖిల్, చందు మొండేటి క్రేజీ కాంబినేషన్లో కార్తికేయ 2 సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు పూర్తయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా కార్తికేయ 2 సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ 20 కోట్లకు జీ సంస్థలు సొంతం చేసుకున్నాయి.
ఇప్పటివరకు సినిమా నుంచి కేవలం ఒక టీజర్ కూడా విడుదల కాలేదు.. ఎలాంటి విజువల్స్ కూడా బయటికి రాలేదు.. కేవలం పోస్టర్స్ మాత్రమే విడుదలయ్యాయి. వీటితోనే కార్తికేయ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కేవలం కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ మాత్రమే విడుదలైంది. వీటితోనే సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరగడం గమనార్హం. Saviours Emerge in crisis అంటూ ఆ మధ్య విడుదలైన నిఖిల్ బర్త్ డే పోస్టర్లో ఉన్న మ్యాటర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ముగ్ధ అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఈమె పాత్ర చాలా కొత్తగా.. ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నాడు దర్శకుడు చందూ మొండేటి. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
MAA | ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జీవిత, హేమ.. కారణమిదే
Tollywood Drugs Case| రకుల్ ప్రీత్ సింగ్‌పై ఈడీ ప్రశ్నల వర్షం.. 6 గంటల పాటు విచారణ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

