Dil Raju | సినిమాలను పైరసీ చేస్తున్న దేశంలోనే అతిపెద్ద ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారని తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ టూల్స్‌తోపాటు ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ముఠా సభ్యులు తెలుగుతోపాటు పలు భాషల సినిమాలను పైరసీ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పైరసీ ముఠా సినిమా ఇండస్ట్రీకి సుమారు రూ.22 వేల కోట్ల వరకు నష్టం కలిగించినట్టు పోలీసులు అంచనా వేసినట్టు సమాచారం. కాగా సినిమా పైరసీ రాకెట్ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అభినందించారు.
ఈ విషయమై దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. పైరసీ వల్ల జరుగుతున్న నష్టం కేవలం నిర్మాతలను మాత్రమే కాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని సైతం దెబ్బతీస్తోందన్నారు. సినిమా స్క్రీనింగ్‌కు సంబంధించి క్యూబ్ (Qube), యూఎఫ్ఓ (UFO) వంటి ప్రముఖ డిజిటల్ ప్రొవైడర్ల సర్వర్లను కూడా పైరసీ ముఠాలు హ్యాక్ చేస్తున్నాయని పోలీసుల విచారణలో తేలిందని దిల్ రాజు వెల్లడించారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారిలో బీహార్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడని.. అతను కేవలం కిక్ కోసమే ఇలా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
ప్రతీ సినిమాపై 18 శాతం జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అందిస్తున్నాం. అలాంటిది పైరసీ వల్ల ప్రభుత్వ ఖజానాకు కూడా పెద్ద మొత్తంలో గండిపడుతుంది. సినిమాను పైరసీల బారి నుంచి కాపాడేందుకు కొత్త అప్డేట్స్ తీసుకొస్తున్నప్పటికీ హ్యాకర్లు దానికి మించి కొత్త మార్గాల్లో దొంగతనం చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ సమస్యను అరికట్టేందుకు పోలీసులతో కలిసి కొత్త అప్డేట్ష్ కోసం చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. సినిమా తీసే వారిలో 95 శాతం మంది నష్టపోతుండగా.. కేవలం 5 శాతం మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారని.. వారికి కూడా ఈ పైరసీ కష్టాలు తప్పడం లేదన్నారు.
Pawan Kalyan | ఓజీ సినిమాలో పవన్ చిన్నప్పటి పాత్ర పోషించిన నటుడు ఎవరో మీకు తెలుసా?
Chiranjeevi | టీమిండియాకి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు.. తెలుగు తేజంపై ప్రశంసలు
OTT | ఈ దసరాకి థియేటర్‌తో పాటు ఓటీటీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్.. ఎన్ని సినిమాలు రాబోతున్నాయంటే!