Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు పుట్టిస్తుంది. ఈ చిత్రం దాదాపు ₹200 కోట్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఓజీలో, ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ స్టైలిష్ విలన్ పాత్రలో అదరగొట్టాడు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సుహాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, బిగ్‌బాస్ శుభశ్రీ రాయగురు వంటి ప్రముఖులు వివిధ పాత్రల్లో మెరిశారు.
సినిమా కథ జపాన్ లో సమురాయ్ లతో ఉండే పవన్ కళ్యాణ్ ఇండియాకు ఎందుక వచ్చాడు అనే అంశంతో మొదలవుతుంది. అయితే కథలో డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్‌ని చూపించకుండా చిన్నప్పటి పాత్రతో ఆసక్తి రేకెత్తించారు. ఈ పాత్రలో మొదట పవన్ తనయుడు అకిరా నందన్ నటిస్తాడనే ప్రచారాలు జరిగాయి. కాని సినిమా చూశాక అవన్నీ అవాస్తవాలు అని తేలింది. అయితే ఆ పాత్రలో నటించింది ఎవరు అనే ఆలోచన అందరి మదిలో మెదులుతుంది. ఆ ఆర్టిస్ట్ పేరు ఆకాశ్ శ్రీనివాస్ కాగా, చిత్రంలో సూపర్బ్ ప్రదర్శనతో అందరి మనసు దోచుకున్నాడు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆకాశ్ శ్రీనివాస్ ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించాడు. ‘రంగరంగ వైభవం’, ‘నాంది’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీశ్’, ‘బంగార్రాజు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి సినిమాల్లో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రముఖ బ్లాక్‌బస్టర్ ‘కల్కి’లో ప్రభాస్ చిన్నప్పటి పాత్రను కూడా ఆకాశ్ పోషించి, సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు.’ఓజీ’లో జపాన్ మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో ఆకాశ్ తన ఫైట్ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించి వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ, సోషల్ మీడియా ద్వారా అభిమానుల ప్రేమను పొందుతూ, ఈ యువ నటుడు ఫ్యూచర్ స్టార్‌గా మారుతున్నాడు.