OTT | ప్రస్తుతం థియేటర్లలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా హవా కొనసాగుతోంది. ఈ చిత్రం ప్రభావంతో ఈ దసరా పండగ సీజన్లో తెలుగు స్ట్రెయిట్ సినిమాలు విడుదల కావడం లేదు. రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’, ధనుష్ డబ్బింగ్ చిత్రం ఇడ్లీ కొట్టు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు, ఓటీటీ వేదికలపై మాత్రం పండుగ సందడి మొదలైపోయింది. పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో రానున్న ముఖ్యమైన కంటెంట్ ఏంటనేది చూస్తే.. ముందుగా లిటిల్ హార్ట్స్ గురించి చెప్పుకోవాలి. థియేటర్లలో మంచి వినోదాన్ని అందించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. కామెడీని ఇష్టపడే వారికి ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ అందించనుందని చెప్పవచ్చు.
ఇక జూనియర్స్, మదరాసి: ఈ రెండు సినిమాలు సీరియస్ డ్రామా మరియు యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్లో కొంత ఆసక్తిని రేపుతున్నాయి. ద గేమ్ (శ్రద్ధా శ్రీనాథ్): మిస్టరీ, థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో బోలెడన్ని ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.ఈ దసరా సందర్భంగా కొత్తగా వస్తున్న ఈ కంటెంట్‌తో ప్రేక్షకులు ఇంట్లోనే పండగను సందడిగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది. పలు ఓటీటీలలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ చూస్తే..
ఆహా
జూనియర్ (తెలుగు సినిమా) – సెప్టెంబరు 30
ఈటీవీ విన్
లిటిల్ హార్ట్స్ (తెలుగు సినిమా)- అక్టోబరు 01
నెట్‌ఫ్లిక్స్
మిస్సింగ్ కింగ్ (జపనీస్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 29
నైట్ మేర్స్ ఆఫ్ నేచర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 30
ద గేమ్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
మాన్స్టర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 03
అమెజాన్ ప్రైమ్ వీడియో
మదరాసి (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 01
ప్లే డర్టీమూవీ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 01
సన్ నెక్స్ట్
సాహసం (తమిళ మూవీ) – అక్టోబరు 01
గౌరీ శంకర (కన్నడ సినిమా) – అక్టోబరు 01
టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (తమిళ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
జీ5 ఓటీటీలో..
చెక్ మేట్ (మలయాళ సినిమా) – అక్టోబరు 02
డాకున్ డా ముందా 3 (పంజాబీ మూవీ) – అక్టోబరు 02
జియో హాట్‌స్టార్
అన్నపూరణి (మూవీ)- అక్టోబరు 01
సోనీ లివ్
13th (హిందీ వెబ్ సిరీస్) – అక్టోబరు 01
ఆపిల్ ప్లస్ టీవీ
ద సిస్టర్ గ్రిమ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
లాస్ట్ బస్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 03