మలయాళ (Mollywood ) స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) సినిమాలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ తన ఫాలోవర్లు అభిమానులకు కొత్త సినిమా అప్డేట్ అందించాడు. మోహన్‌లాల్ నటిస్తోన్న కొత్త చిత్రం మాన్స్టర్ (Monster). ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోపాటు టైటిల్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ మూవీలో మోహన్‌లాల్ పంజాబీ పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ ద్వారా తెలియజేశాడు.
హై యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో లక్కీసింగ్ పాత్ర పోషిస్తున్నాడు. మలయాళంలో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన పులి మురుగన్ దర్శకుడు వైశాఖ్ (Vysakh) తో కలిసి జాయిన్ అయ్యాడు మోహన్‌లాల్. బ్లాక్ టీ షర్ట్, బ్లాక్ టర్బన్, చేతిలో తుపాకీ, టేబుల్‌పై బుల్లెట్లు ఉన్న లుక్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఆశిర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్నారు.
Unveiling the Title and First Look of my new movie 'Monster' directed by Vysakh, scripted by Udaykrishna and produced by Antony Perumbavoor under the banner of Aashirvad Cinemas.
— Mohanlal (@Mohanlal) November 10, 2021
The movie starts rolling today!#Monster #FirstLook @antonypbvr @aashirvadcine pic.twitter.com/MHCb9N7S6o
ఇవాళ షూటింగ్ షురూ అయింది. మోహనలాల్ నటిస్తోన్న బ్రో డాడీ, ప్రియదర్శన్ దర్శకత్వంలో చేస్తున్న చారిత్రాకయాక్షన్ చిత్రం మరక్కర్ విడుదల కావాల్సి ఉన్నాయి.
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!