RC15 | సినీరంగంలో కొందరు దర్శకులతో కలిసి పనిచేసే అదృష్టం ఎప్పుడెప్పుడు వస్తుందా అని నటులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలాంటి దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన సినిమాలో చిన్న వేషం అయినా సరే వేయడానికి పేరున్న నటీనటులు ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే ఈయన సినిమాల్లో ప్రతి క్యారెక్టర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రస్తుతం ఈయన రామ్‌చరణ్‌తో #RC15 తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం శంకర్ బృందం ప్రముఖ స్టార్ హీరోతో సంప్రదింపులు జరిపిందట. అయితే ఆ స్టార్ హీరో మాత్రం ఈ ఆఫర్‌ను తిరస్కరించాడట.
ఇంతకి ఆ హీరో ఎవరనుకుంటున్నారా ?ఆయన మరెవరో కాదు మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్. తాజాగా ఈ చిత్రంలోని ప్రతినాయకుడి పాత్ర కోసం మేకర్స్ మోహన్‌లాల్‌ను సంప్రదించారట. కథ విన్న మోహన్‌లాల్ ప్రస్తుతం ఆయన ఉన్న ఫాంలో ఇలా విలన్ క్యారెక్టర్లు చేస్తే ఇమేజ్ పడిపొతుందిని భావించి శంకర్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై మేకర్స్ స్పందించే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ స్టూడెంట్‌గా, ప్రభుత్వ ఉద్యోగిగా రెండు పాత్రల్లో నటించనున్నట్లు టాక్. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది.
Read Also:
Nikhil | నేరుగా ‘ఓటీటీ’లోకి నిఖిల్ సినిమా?
Ghani Review | వరుణ్‌తేజ్ ‘గని’ మూవీ రివ్యూ
Akhil ‘Agent’ | మాస్‌లుక్‌లో అక్కినేని అఖిల్.. ఆకట్టుకుంటున్న బర్త్‌డే పోస్టర్
Allu Arjun | ‘అల్లుఅర్జున్’ బర్త్‌డే స్పెషల్