Nikhil Movie On OTT | యువ హీరో నిఖిల్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ‘అర్జున్ సురవరం’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. ఈ మూడేళ్ళ గ్యాప్‌ను పూర్తీ చేసేందుకు నిఖిల్ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో సుకుమార్ నిర్మిస్తున్న ’18పేజిస్’, ‘కార్తికేయ-2’ లు షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటితో పాటు ‘స్వామిరారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడు. గతేడాదే ఈ సినిమాపై ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ మొదలు పెట్టనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
సుధీర్‌బాబు, నిఖిల్ కాంబోలో తెరకెక్కబోయే ఈ హ్యట్రిక్ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర మేకర్స్ పలు ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపగా చివరికి ‘జీ-5’ సంస్థతో భారీ డీల్‌ను కుదిరించుకుందని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో ఈ కాంబోలో తెరకెక్కిన ‘స్వామిరారా’, ‘కేశవ’ చిత్రాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఇదిలా ఉంటే సుధీర్ వర్మ లేటెస్ట్గా తెరకెక్కించిన ‘శాకినీ ఢాకినీ’ చిత్రం కూడా నేరుగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సుధీర్ వర్మ ప్రస్తుతం మాస్రాజ రవితేజతో ‘రావణాసుర’ చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది.
Read Also:
Akhil ‘Agent’ | మాస్‌లుక్‌లో అక్కినేని అఖిల్.. ఆకట్టుకుంటున్న బర్త్‌డే పోస్టర్
Allu Arjun | ‘అల్లుఅర్జున్’ బర్త్‌డే స్పెషల్
Ghani Review | వరుణ్‌తేజ్ ‘గని’ మూవీ రివ్యూ