Mohanlal | మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు మాలీవుడ్ సీనియర్ యాక్టర్ సిద్దిఖీ తనను ట్రాప్ చేసి రేప్ చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ సర్కిల్లో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ ప్రెసిడెంట్ మోహన్‌లాల్‌తోపాటు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Association of Malayalam Movie Artists) సభ్యులందరూ రాజీనామా చేశారు.
అయితే మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన నటుడు మోహన్ లాల్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించాడు. హయత్ రీజెన్సీలో కేరళ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన అనంతరం మోహన్‌లాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అమ్మ (మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అనేది ట్రేడ్ యూనియన్ కాదని ఇది ఒక కుటుంబం లాంటిదని తెలిపాడు అమ్మ అసోసియేషన్‌పై లైంగిక ఆరోపణలు రావడం దురదృష్టకరం. అమ్మ కోసం చాలా మంచి పనులు చేశాం. మన ఇండస్ట్రీలో పరిస్థితి. ఇతర చిత్ర పరిశ్రమల కంటే మెరుగ్గా ఉంది అంటూ వెల్లడించారు.
మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పేరుని చెడగొట్టకండి. దీనిపై ఫోకస్ చేయకండని మీడియాతో పాటు ప్రేక్షకులను అభ్యర్థిస్తున్నాను. హేమ కమిషన్‌ను విచారణ జరుగుతోంది. తీర్పు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. దయచేసి మలయాళ సినీ పరిశ్రమను నాశనం చేయకండి అంటూ మోహన్ లాల్ తెలిపారు. ఒక నటుడిగా నిర్మాతగా నా హోదాలో రెండుసార్లు హేమా కమిషన్‌కు నా వాంగ్మూలం కూడా ఇచ్చాను. కమిటీ రిపోర్ట్‌ను నేను స్వాగతిస్తున్నాను. మహిళలను వేధించిన దోషులను కచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలి. అందుకు పోలీసులకు సాధ్యమయ్యే ప్రతి విధంగా సహకరిస్తాం. అలాగే తాను ఏ అధికార వర్గానికి చెందినవాడిని కానని మలయాళ చిత్ర పరిశ్రమ చాలా మందికి జీవనోపాధిగా ఉందని.. దానికి టార్గెట్ చేయవద్దని లాల్ మీడియాకు విజ్ఞప్తి చేశారు.
హేమా కమిషన్ నివేదిక విడుదలైన తర్వాత మరియు AMMA అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత మోహన్‌లాల్ మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి. కొంతమంది సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మోహన్‌లాల్‌తో సహా అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని సభ్యులందరూ గత వారం ఉమ్మడి రాజీనామా సమర్పించారు.
Also Read..