పిసినారి పెళ్లి కష్టాలు

హాస్యనటుడు సత్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వివాహ భోజనంబు’. హీరో సందీప్‌కిషన్, కె.ఎస్ శినీష్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ అబ్బరాజు దర్శకుడు. అర్జావీరాజ్ కథానాయిక. శుక్రవారం టీజర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. పిసినారి వ్యక్తిగా సత్య చేసే ఆకతాయి పనులతో టీజర్ వినోదాత్మకంగా సాగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘యథార్థ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న చిత్రమిది. లాక్డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నాడన్నది ఆద్యంతం నవ్విస్తుంది. మహేష్ అనే పిసినారి యువకుడిగా సత్య కనిపిస్తారు. నెల్లూరు ప్రభగా ప్రత్యేక పాత్రలో సందీప్‌కిషన్ నటిస్తున్నారు’ అని తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయశర్మ, టి.ఎన్.ఆర్, వైవాహర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మణికందన్, సంగీతం: అనిరుధ్ విజయ్.
తాజావార్తలు
- చదువులమ్మను చట్టసభకు పంపుదాం..
- మహిళా లోకం.. వాణీదేవి వైపే
- బాధ్యతాయుతంగా పనిచేయాలి
- సంక్షేమ పథకాలను వివరించాలి
- అన్నిపార్టీలు అక్కడే తిష్ట.. దూకుడుగా గులాబీ
- మీటర్లు తిరుగుతున్నయ్..
- నిత్యం పచ్చతోరణం
- జిల్లాలో గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్ పూర్తి
- కాసులు కురిపిస్తున్న.. కార్గో సేవలు
- పని చేస్తున్న ఇంటికే కన్నం ..