శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Aug 02, 2020 , 10:00:35

చిరంజీవి బ‌ర్త్‌డే స్పెషల్.. మెగాస్టార్ మెగా ర్యాప్!

చిరంజీవి బ‌ర్త్‌డే స్పెషల్.. మెగాస్టార్ మెగా ర్యాప్!

మెగాస్టార్ చిరంజీవి.. త‌న న‌ట‌న‌తో కోట్లాది మంది హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్నాడు. చిరు సినిమాలు విడుద‌లైన‌, మెగాస్టార్ బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌రిగిన తెలుగు రాష్ర్టాల్లో ఉన్న ఆయ‌న అభిమానుల సంద‌డి మామూలుగా ఉండ‌దు. భారీ క‌టౌట్‌లు ద‌ర్శ‌న‌మిస్తాయి.. పాలాభిషేకాల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంటుంది. ఆయ‌న బ‌ర్త్‌డే వేడుక‌లు వ‌స్తున్నాయంటే.. అభిమానుల్లో ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది. ఆగ‌స్టు 22న 65వ పుట్టిన రోజు చిరు జ‌రుపుకోబోతున్నారు. దీంతో మెగాస్టార్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌కు ఆయ‌న అభిమానులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

ఇక ఆయ‌న పుట్టిన‌రోజు కంటే ముందు రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. మెగాస్టార్ మెగా ర్యాప్ పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు.

మెగా ర్యాప్ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను శనివారం సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేశారు. ఈ నెల 21న పాటను విడుదల చేయనున్నారు. విడుదలైన మరుసటి రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని తెలిసిందే. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శివ చెర్రీ నేతృత్వంలో విడుదలైన స్పెషల్ సాంగ్ పలువురు ప్రశంసలు అందుకుంది. సినిమా ప్రముఖులు ప్రత్యేకంగా పాట గురించి కొనియాడారు. మెగా ర్యాప్‌కు కూడా అటువంటి స్పందన వస్తుందని శివ చెర్రీ ఆశిస్తున్నారు. ఈ పాటకు ఫ్రీక్ మాసన్ సంగీతం అందించారు. సురేంద్ర (స్కార్పియన్) ర్యాప్ ఆలపించారు. నిఖిల్ కాన్సెప్ట్స్ వీడియో కంపోజిషన్ చేసింది.


logo