VNR Trio | టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin), యువ దర్శకుడు వెంకీకుడుముల (Venky Kudumula) కాంబినేషన్లో వచ్చిన చిత్రం భీష్మ. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఈ చిత్రంతో ముగ్గురు మంచి బ్రేక్ అందుకున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ మరో సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. అగ్రచిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ముగ్గురితో సినిమా చేస్తోంది. మరింత అడ్వెచరస్, మరింత వినోదాన్ని అందించేందుకు VNR Trio మీ ముందుకొస్తుందని ఇప్పటికే జీవీ ప్రకాశ్ కుమార్ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు జరుగనుండగా.. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నాడు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ భీష్మను మించిన ఎంటర్టైన్ అందించడం ఖాయమని.. వీడియోలో స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని వెంకీ కుడుముల చెప్తున్న మాటలతో అర్థమవుతోంది.
నితిన్ ఇప్పటికే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫేం డైరెక్టర్ వంశీతో సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. పెండ్లిసందD ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. చాలా రోజుల క్రితం మారేడుమిల్లి ఫారెస్ట్ షూటింగ్ లొకేషన్లో దిగిన స్టిల్ ఒకటి షేర్ చేశాడు నితిన్. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది. మొత్తానికి ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే.. మరో సినిమా ప్రకటించేసి మూవీ లవర్స్ ను ఖుషీ చేస్తున్నాడు నితిన్.
The Grand Launch of #VNRTrio movie will be graced by the one and only Megastar @KChiruTweets Garu ❤️🔥
Pooja Ceremony Tomorrow 💥💥@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash pic.twitter.com/ilBRF8VJ5i
— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2023
Shaakuntalam | శాకుంతలం అప్డేట్.. మేలిమి బంగారంలా సమంత శకుంతల దేవి లుక్
Rangamarthanda | బ్రహ్మానందం నటనకు చిరంజీవి, రాంచరణ్ ప్రశంసలు
Kushi | ఆఫీస్‌కు వెళ్తూ సమంతకు బై చెప్తోన్న విజయ్ దేవరకొండ.. ఖుషి తాజా పోస్టర్
MarutiNagar Subramanyam | మారుతి నగర్లో ఫన్ షురూ.. రావు రమేశ్ ఎంట్రీ అదుర్స్