లండన్: భారత స్టార్ క్రికెటర్ విరాట్‌కోహ్లీ క్రేజ్ ఏంటో మరోమారు తెలిసివచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. విరుష్క దంపతులు కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ వినూత్న రీతిలో ఒక ఫొటోను పోస్ట్ చేశారు.
కోహ్లీ స్పైడర్‌మ్యాన్ మాస్క్‌లో కనిపించగా, అనుష్క బటర్‌ఫ్లై డిజైన్‌తో ఆకట్టుకుంది. పోస్ట్ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే అభిమానుల నుంచి మిలియన్ల కొద్ది లైక్‌లు వచ్చాయి.