Megastar chiranjeevi | కరోనా కారణంగా ఇప్పుడు సినిమా షూటింగ్స్ పెద్దగా జరగడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఇంట్లోనే ఉండిపోయారు. చిరంజీవి ఇంకొన్ని రోజులు షూటింగ్స్ బంద్ చేసి ఇంట్లోనే ఉండబోతున్నాడు. ఈ ఖాళీ సమయాన్ని సినిమాలు చూడటానికి కేటాయిస్తున్నాడు మెగాస్టార్. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు మిగిలిన భాషల సినిమాలు కూడా చూస్తున్నాడు చిరంజీవి. ఈ క్రమంలోనే ఒక బెంగాలీ సినిమా ట్రైలర్ను ట్వీట్ చేశాడు చిరంజీవి. పైగా బెంగాలీలో ట్వీట్ చేశాడు. అది చూసి అభిమానులు షాకవుతున్నారు.
అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్ కథానాయకుడు, అశ్వథ్థామ, భీష్మ, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలతో టాలీవుడ్లో స్టైలిష్ విలన్గా పేరు తెచ్చుకున్నాడు విలక్షణ బెంగాలీ నటుడు జిషుసేన్ గుప్త ( jisshu sengupta ). ఆయన మన దగ్గర విలన్ కానీ బెంగాలీలో మాత్రం స్టార్ హీరో. తాజాగా ఈయన నటించిన తాజా బెంగాలీ చిత్రం ‘బాబా బేబీ ఓ’. ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది అరిత్ర ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సోలంకి రాయ్ కథానాయిక. కథలోకి వెళితే 40 ఏండ్ల మేఘ్ .. సరోగసీ పద్ధతిలో పుట్టిన పిల్లల్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి వృష్టి అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆ తర్వాత ఆయన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ సినిమా కథ. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను తన ట్విట్టర్ లో షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. జిషు సేన్ కు విషెస్ తెలిపారు.
Sharing the Fun & Emotional trailer of Bengali film #BabaBabyOhttps://t.co/zgrAkHKcyH
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 23, 2022
Wishing my dear friend @Jisshusengupta
All the Very Best for its success !
রেম আছে, মজাও আছে সাথে মিষ্টি গান…
বাবা, বেবি ও মানেই হাসি-মজা আর ফান 😊
‘ఫన్ అండ్ ఎమోషనల్ బెంగాలీ మూవీ ‘బాబా బేబీ ఓ’ ట్రైలర్ ను షేర్ చేస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నా స్నేహితుడు జిషు సేన్ గుప్తాకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను’.. అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు. అయితే అంత చొరవ తీసుకొని ఒక బెంగాలీ సినిమా ట్రైలర్ చిరంజీవి షేర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ అందరూ ఆలోచిస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు జిషుసేన్ గుప్తా. అందుకే ఆయన నటిస్తున్న బెంగాలీ చిత్రం ట్రైలర్ షేర్ చేశాడు మెగాస్టార్. భోళా శంకర్ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేశ్ ఇందులో చిరంజీవి చెల్లిగా నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నా కథానాయిక.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
RC15 | ఒక్క పాటకే 25 కోట్లా.. మరి సినిమా టోటల్ బడ్జెట్ ఎంత?
మెగా కుటుంబం అల్లుడిని దూరం పెట్టడానికి కారణం అదేనా..?
కృతిశెట్టికి నచ్చిన హీరో ఎవరు? బేబమ్మకు లెటర్ రాసిన స్టార్ హీరో ఎవరంటే..
Kalyan dev | మెగా అల్లుడు కెరీర్ ముగిసినట్లేనా.. ఏం జరగబోతోంది..?