Kalyan dev |మెగా అల్లుడు కెరీర్ ముగిసినట్లేనా.. ఏం జరగబోతోంది..?

Kalyan dev |మెగా కుటుంబంలో ఒకడిగా ఉంటే అవకాశాలకు కొదవ ఉండదు. ఫలితంతో సంబంధం లేకుండా ఆయనకు వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అదే ఆ కుటుంబం నుంచి బయటికి వస్తే ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాదు. మెగా కాంపౌండ్‌లో ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకే ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా ప్రేక్షకులు అలాగే ఆదరిస్తారు. మూడేళ్ల కింద చిరంజీవి కుటుంబం నుంచి ఒక కొత్త హీరో వచ్చాడు. ఆయన పేరు కళ్యాణ్ దేవ్. చిరు చిన్న కూతురు శ్రీజ భర్త ఈయన. పెళ్లి సమయంలోనే కళ్యాణ్ దేవ్‌ను చూసి హీరో అవుతాడు అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే 2018 లో విజేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మొదటి సినిమాకు మెగా కుటుంబం అంతా వచ్చి అల్లుడుని బాగా ప్రమోట్ చేశారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో కళ్యాణ్ కోరుకున్న బ్రేక్ రాలేదు. అయినా కూడా ఆయనకేం తక్కువ చిరంజీవి అల్లుడు కాబట్టి అవకాశాలు వచ్చాయి. వరుస అవకాశాలు దక్కించుకున్నాడు కానీ మునపటిలా ఇప్పుడు మెగా సపోర్ట్ ఆయనకు లేదు. మొన్న విడుదలైన సూపర్ మచ్చి సినిమాను మెగా కుటుంబంలో ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ప్రమోషన్ కూడా చేయలేదు. శ్రీజతో ఈయనకు మనస్పర్థలు మొదలయ్యాయని.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ.. కళ్యాణ్ దేవ్ కెరీర్ ముగిసిపోయినట్లే అని విశ్లేషకులు చెబుతున్న మాట. ఎందుకంటే మెగా సపోర్ట్ ఉంది కాబట్టి ఆయనకు అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం కిన్నెరసాని సినిమాతో బిజీగా ఉన్నాడు మెగా అల్లుడు. కానీ ఈ సినిమా ఒకటి వస్తున్నట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. కొత్త సినిమాలేవీ కమిట్ అవ్వలేదు. ఒకవేళ నిజంగానే ప్రచారం జరుగుతున్నట్లు శ్రీజతో విడాకులు తీసుకుంటే కళ్యాణ్ దేవ్ కెరియర్ అర్థంతరంగా ముగిసిపోయినట్లే. అందులో ఇంకో అనుమానం కూడా అవసరం లేదు. చూడలిక ఏం జరగబోతుందో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
మెగా కాంపౌండ్‌లోకి ఎంటర్ అవుతున్న కృతి శెట్టి.. వైష్ణవ్ తేజ్ తర్వాత ఆయనతో..
Pushpa | వాయిస్ ఆర్టిస్ట్‌గా పనికిరావన్నారు.. ఇప్పుడు హిందీలో ‘తగ్గేదేలే’ అంటూ ఊపేస్తున్నాడు!
రంగంలోకి దిగిన రజినీ, కస్తూరి రాజా.. ధనుష్, ఐశ్వర్య జంట మళ్లీ కలవబోతున్నారా!
కృతిశెట్టికి నచ్చిన హీరో ఎవరు? బేబమ్మకు లెటర్ రాసిన స్టార్ హీరో ఎవరంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

