హైదరాబాద్ : ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ అవార్డు దక్కించుకోవడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇక స్ట్రాంగ్ ఫిజిక్‌తో యాక్షన్ సన్నివేశాలను రక్తికట్టించే రామ్ చరణ్ డైట్ ప్లాన్ తెలుసుకోవాలని ప్రేక్షకాభిమానులతో పాటు పలువురు ఆసక్తి కనబరుస్తుంటారు. మెగా పవర్‌స్టార్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఎలాంటి ఆహార పదార్దాలను తీసుకుంటారనే వివరాలు ఇటీవల వెలుగుచూశాయి.
బ్రేక్‌ఫాస్ట్
రామ్ చరణ్ ప్రతిరోజూ ఉదయాన్నే రెండు పూర్తి ఎగ్స్‌తో పాటు మూడు ఎగ్ వైట్స్ తీసుకుంటారు. ప్రొటీన్లు, ఆరోగ్యకర కొవ్వులు అధికంగా ఉండే ఎగ్స్‌తో శక్తి లభించడమే కాకుండా కడుపునిండిన భావనతో ఇవి బరువు తగ్గించడంలోనూ సహకరిస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు చరణ్ రోజూ బాదం పాలు తాగుతారు. ఓ బౌల్ ఓట్స్ తీసుకుంటారు. ఈ రెండింటిలో ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, విటమిన్ ఈ లభిస్తాయి.
లంచ్
కర్రీ లేదా ఆకుకూరలు, కూరగాయలతో కలిపి చికెన్ వింగ్స్‌తో లంచ్ చేస్తారు. తక్కువ క్యాలరీలతో కూడిన బ్రౌన్‌రైస్ తీసుకుంటారు. బరువు తగ్గాలనుకునే వారికి వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ మెరుగైనది
డిన్నర్
డిన్నర్‌కు ముందు ఫ్రైడ్ ఫిష్ తీసుకుంటారు. కూరగాయలతో చేసిన సలాడ్ డిన్నర్లో ఉంటుంది. ఇక రోజంతా మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు, స్నాక్స్‌గా డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు.
Read More :
oscars 2023 | ‘నాటు నాటు’ పాట మాత్రమే కాదు.. అంతకుమించి..: ఆనంద్ మహీంద్ర