Varun Tej | కొండగట్టు (Kondagattu) అంజన్న (Anjanna Temple) ఆలయాన్ని మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) సందర్శించారు. మంగళవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న వరుణ్ తేజ్‌కు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో వరుణ్ తేజ్ ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని వరుణ్ తేజ్ తెలిపారు.
కాగా, వరుణ్ తేజ్ (Varun Tej) కాంపౌండ్ నుంచి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన చిత్రం మట్కా (Matka). పలాస 1978 ఫేం డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో భారీ అంచనాల మధ్య నవంబర్ 14న గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టినా.. కథనం బెడిసి కొట్టడంతో బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. థియేటర్స్‌లోకి వచ్చి నెలరోజులు కూడా కాకుండానే ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా డిసెంబర్ 05 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read..
Jailer 2 | ఇళయరాజాతో రజినీకాంత్.. జైలర్ 2 వర్క్‌మోడ్
Hari Hara Veera Mallu | మీసం మెలేస్తున్న హరిహరవీరమల్లు.. పవన్ కల్యాణ్ నయా ఫొటోషూట్ చాలా స్పెషల్