Jailer 2 | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar)తో చేయబోతున్న సీక్వెల్ ప్రాజెక్ట్ జైలర్ 2 (Jailer 2). ఇప్పటికే కూలీ షూటింగ్లో బిజీగా ఉన్న తలైవా ఇక జైలర్ 2 చిత్రీకరణలో కూడా పాల్గొనబోతున్నాడు. తలైవా పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న జైలర్ 2 ప్రోమో రాబోతుందని తెలిసిందే.
ఈ నేపథ్యంలో రజినీకాంత్ ఇళయరాజాతో కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తలైవా ప్రోమో షూట్ కోసం ఈవీపీ ఫిలిం సిటీకి వెళ్తుండగా ఈ ఫొటో దిగారు. బర్త్ డేన కూలీ న్యూ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఇన్సైడ్ టాక్.
జైలర్ 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. జైలర్ ఫస్ట్ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి , మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రల్లో నటించగా.. సీక్వెల్‌లోని పాత్రలపై క్లారిటీ రావాల్సి ఉంది. రజినీకాంత్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో చేస్తున్న కూలీ 2025లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Latest click of #Rajinikanth with #Ilaiyaraja.
Today, superstar is traveling to evp for #Jailer part 2 promo shoot.
Updates on the film #Coolie and #Jailer2 is arriving 12th December. pic.twitter.com/Y05O3Fubdg
— Manobala Vijayabalan (@ManobalaV) December 3, 2024
Allu Arjun | ఐదేళ్ల నుంచి ఒకే హీరోయిన్ : పుష్ప 2 ది రూల్ ఈవెంట్లో అల్లు అర్జున్
Allu Arjun | పుష్ప 2 ది రూల్‌కు సపోర్ట్.. ఏపీ ప్రభుత్వానికి అల్లు అర్జున్ ధన్యవాదాలు